టెక్నాలజీ  : ఆ​ ఫీచర్​ వచ్చేసింది

టెక్నాలజీ  : ఆ​ ఫీచర్​ వచ్చేసింది

కార్ క్రాష్​ డిటెక్షన్ ఫీచర్​ ఇప్పుడు మనదేశంలో కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఈ ఫీచర్​ని 2019లో గూగుల్ పిక్సెల్​4లో తెచ్చింది. ఈ కొత్త ఫీచర్ మొదట్లో సెలక్ట్​ చేసిన కొన్ని దేశాల్లో మాత్రమే ఉండేది. కానీ, ఇప్పుడు ఆస్ట్రియా, బెల్జియం, పోర్చుగల్​, స్విట్జర్లాండ్​లతోపాటు మనదేశంలోనూ వచ్చేసింది. అయితే ఇండియాలో ఈ ఫీచర్ కేవలం పిక్సెల్​ 4ఎ, 6ఎ, 7, 7 ప్రొ, 7ఎ, 8, 8 ప్రొ వంటి మోడల్స్​లో మాత్రమే అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్స్​లో అయితే...  పిక్సెల్ 7, పిక్సెల్​ ఫోల్డ్​తో సహా అన్ని మిగతా మోడల్స్​లోనూ ఈ ఫీచర్​ ఉంది. అయితే, ఈ ఫీచర్​ ఇంగ్లిష్​, డానిష్​, డచ్, ఇటాలియన్, జపనీస్​ వంటి పదకొండు భాషల్లో ఉంది. 

ఇలా ఆన్​ చేయాలి

  •     పిక్సెల్​ ఫోన్​లో క్రాష్​ డిటెక్షన్​ ఫీచర్​ను ఎలా ఆన్​ చేయాలంటే... ఫోన్​లో యాప్ మేనేజర్​లో ఉన్న పర్సనల్ సేఫ్టీ అనే యాప్​ ఓపెన్​ చేయాలి. 
  •     పర్సనల్ సేప్టీ యాప్​లో ఫీచర్స్ ఆప్షన్​ సెలక్ట్ చేయాలి. 
  •     కార్​ క్రాష్​ డిటెక్షన్​ మీద ట్యాప్​ చేయాలి. 
  •     కార్​ క్రాష్​ డిటెక్షన్​ ఫీచర్​ని ‘సెటప్​’ చేసే ఆప్షన్​ కనిపిస్తుంది. సెటప్​ ప్రాసెస్ స్టార్ట్​ చేయడానికి దానిపై ట్యాప్ చేయాలి.
  •     ఫీచర్ బాగా పని చేయడానికి లొకేషన్ షేర్ చేయమని ప్రాంప్ట్ వస్తుంది. ‘ఎలౌ వైల్ యాప్​ ఈజ్​ ఇన్ యూజ్’ ఆప్షన్​ ట్యాప్​ చేయాలి. క్రాష్​ టైంలో లొకేషన్​ యాక్సెస్ చేసే యాప్​ పర్మిషన్​           ఇస్తుంది. 
  •     ఆ తర్వాత మైక్రోఫోన్​ని షేర్ చేయడానికి, ఫిజికల్ యాక్టివిటీని యాక్సెస్​ చేసేందుకు పర్మిషన్​ ఇస్తుంది. క్రాష్​ డిటెక్షన్​ ఫీచర్​ ఫుల్ యాక్టివిటీని ఎనేబుల్ చేయడానికి ‘ఎలౌ’ ఆప్షన్​ మీద            ట్యాప్​ చేయాలి.

  ఇలా పని చేస్తుంది

పైన చెప్పిన పిక్సెల్​ మోడల్​ ఫోన్​లు, ఫోల్డబుల్ ఫోన్లతో పాటు డివైజ్​ లొకేషన్, మోషన్ సెన్సర్​లు దగ్గర్లోని సౌండ్స్​ గ్రహిస్తాయి. తద్వారా యూజర్ల కారు క్రాష్​కి గురైతే వెంటనే తెలిసిపోతుంది. అది తెలుసుకోవాలంటే... కారు క్రాష్​ రికగ్నిషన్​ కోసం లొకేషన్, ఫిజికల్ యాక్టివిటీ, మైక్రోఫోన్​ యాక్సెస్​ ఉండాలి. క్రాష్​ని గుర్తించిన ఫోన్​ వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్​లకు కాల్ చేస్తుంది. ఈ ఫోన్​ కాల్ ఆండ్రాయిడ్​ ఎమర్జెన్సీ లొకేషన్​ సర్వీస్​ను వాడుకుంటుంది. క్రాష్​ అయిన లొకేషన్​ గురించి సమాచారం ఇవ్వడమే కాకుండా అక్కడి పరిస్థితిని కూడా చెప్తుంది. మంచి ఫీచరే కానీ అన్నిసార్లు ఫోన్​ క్రాష్​ సౌండ్​ గుర్తించలేకపోవచ్చు. ఒక్కోసారి నెట్​వర్క్ సిగ్నల్​ లేకపోయినా, ఫోన్​లో మాట్లాడుతున్న టైంలో యాక్సిడెంట్​ జరిగితే ఇలాంటి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని గూగుల్​ బ్లాగ్​ పోస్ట్​లో రాశారు. ఇలాంటి సందర్భాలను పక్కన పెడితే కొంతమేర మాత్రం ఈ ఫీచర్​ పనికొస్తుందన్నమాట!

ప్రమాదాలు చెప్పి రావు. అలాంటప్పుడు ఈ ఫీచర్ బాగా పనికొస్తుంది. కార్​లో వెళ్తున్నప్పుడు సడెన్​గా యాక్సిడెంట్​ అయితే... వెంటనే ఫోన్​ అలర్ట్​ అయ్యి ఎమర్జెన్సీ నెంబర్​కి ఫోన్​ చేస్తుంది. ఆ నెంబర్​కి లొకేషన్​ కూడా షేర్ చేస్తుంది.  ఈ ఫీచర్​ గురించిన అప్​డేట్స్ ఇవి.