థాయ్ ఓపెన్ సింగిల్స్ విజేతలు మారిన్‌, విక్టర్‌

థాయ్ ఓపెన్ సింగిల్స్ విజేతలు మారిన్‌, విక్టర్‌
బ్యాడ్మింటన్‌ టోర్నీ థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సింగిల్స్‌ విజేతలుగా కరోలినా మారిన్‌, విక్టర్‌ అక్సెల్సెన్‌ నిలిచారు. మహిళల సింగిల్స్‌ విజేతగా స్పెయిన్‌కు చెందిన మారిన్‌ టైటిల్‌ సొంతం చేసుకుంది. ఫైనల్‌లో 21-9,21-16తేడాతో తైవాన్‌కు చెందిన టాప్‌సీడ్‌ షట్లర్‌ తై జు ఇంగ్‌ను ఓడించింది. ఫైనల్ పోరులో మొదటి నుంచి దూకుడుగా ఆడిన మారిన్‌ ప్రత్యర్థి తైజు ఇంగ్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. తొలి రౌండ్‌లో పీషుఫేయిపై గెలిచి తర్వాత రెండో రౌండులో చోచువాం గ్‌పై, క్వార్టర్స్‌లో కేట్‌తాంగ్‌, సెమీస్‌లో యంగ్‌పై గెలిచి ఫైనల్లో తైజును ఓడించి మారిన్‌ విక్టరీని కైవసం చేసుకుంది. ఫురుషుల సింగిల్స్‌లో డెన్మార్క్‌కు చెందిన విక్టర్‌ అక్సెల్సెన్‌ హాంగ్‌కాంగ్‌ ఆటగాడు అంగస్‌ లాంగ్‌పై 21-14, 21-14 తేడాతో గెలిచి విజేతగా నిలిచాడు. విక్టర్‌ క్వార్టర్స్‌లో జోనాథన్‌ క్రిస్టీ, సెమీస్‌లో గింటింగ్‌పై గెలిచి తుదిపోరులో అంగస్‌లాంగ్‌పై విజయం సాధించి టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత మొదటి ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఇదే.