ఉప్పల్, వెలుగు: సెన్సస్డ్యూటీకి ఆటంకం కలిగించిన ఓ మాజీ కార్పొరేటర్‌తోపాటు మరి కొందరిపై ఉప్పల్ పీఎస్‌లో కేసు నమోదైంది. రామంతాపూర్ వెంకట్‌రెడ్డి నగర్ డివిజన్లోని అహ్మద్‌నగర్‌లో సెన్సస్ డ్యూటీ నిర్వహిస్తున్న ఎన్యూమరేషన్ టీంకు స్థానికులు ఉప్పల్ సర్కిల్ పరిధిలోకి రామంటూ వివరాలు ఇవ్వడానికి నిరాకరించారు. డీలిమిటేషన్లో అహ్మద్‌నగర్ రోడ్నంబర్లు- 9, 10లోని 47 ఇండ్లు ఉప్పల్ సర్కిల్లో కలిశాయని డీసీ శైలజతోపాటు మున్సిపల్ అధికారులు అవగాహన కల్పించినా మొండిగా వాదించారు.
అంబర్పేట్ప్రాంతానికి చెందిన మాజీ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, లోకల్ లీడర్లు బాబా, శ్రీకాంత్ తదితరులు బస్తీవాసుల వివరాలు సేకరించకుండా అడ్డు తగిలారు. గురువారం డీసీ ఫిర్యాదుతో వారిపై కేసు నమోదు చేసినట్లు ఉప్పల్పోలీసులు తెలిపారు. కేసును అంబర్పేట్పీఎస్కు బదిలీ చేస్తామని పేర్కొన్నారు.
