చార్మినార్, వెలుగు: హైదరాబాద్‌లోని కల్పతరు ఫ్యామిలీ కోర్టులో అడ్వకేట్ నిషాత్ రజాపై దాడి చేసిన సంజన జాదవ్‌పై అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్–2026 సెక్షన్ 4(1) కింద క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు మీర్ చౌక్ ఠాణా కొండలరావు తెలిపారు. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు, టీపీసీసీ లీగల్ సెల్- చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్, అడ్వకేట్లు మోమిన్ రోషన్ జమీర్, సాయినాథ్, రోహిత్ పాల్ సింగ్, భార్గవ్, హీనా, నజ్నీన్, సచిన్ శుక్రవారం ఫిర్యాదు చేశారన్నారు.
ఘటనకు సంబంధించిన ఫొటోలు, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌కు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వు కాపీని సమర్పించారని తెలిపారు. ఈ మేరకు ఈ నెల 2 నుంచి అమలులోకి వచ్చిన కొత్త చట్టం ప్రకారం నిందితురాలిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
