- సీఎం చెప్పినవాళ్లందరిపైనా సీబీఐ ఎంక్వైరీ చేయించాలి
- టీఆర్ఎస్ చీఫ్ కవిత డిమాండ్
- సీఎం రేవంత్, హరీశ్ కలిసి డ్రామాలాడుతున్నారని విమర్శ
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న భూముల కన్నా గజం ఎక్కువున్నా ప్రభుత్వానికే సరెండర్ చేస్తానని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. అసెంబ్లీలో 22ఏపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబానికి భూములు ఉన్నట్టుగా ప్రస్తావించిన అంశంపై బుధవారం ‘ఎక్స్’ లో ఆమె స్పందించారు. సీఎం రేవంత్ ఎవరెవరి పేర్లు ప్రస్తావించి.. వారికి ఎక్కువ భూములు ఉన్నట్టుగా చెప్పారో వారందరిపైనా సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
హరీశ్ రావు, కేసీఆర్ ఫాం హౌస్లో ఉండే సీఎం గూఢచారితోపాటు నవీన్ రావు, కొండల్ రావు, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, రామేశ్వర్ రావు, ప్రతిమ శ్రీనివాస్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి భూములపై ఎంక్వైరీ జరిపి.. నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. తాను ఎప్పటి నుంచో చెప్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి, హరీశ్ రావు ఒక్కటేనని మరోసారి స్పష్టమైందని పేర్కొన్నారు. వాళ్లిద్దరూ కలిసే ఈ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.
