CBSE 12వ తరగతి ఫలితాలు విడుదల.. ఎలా చూసుకోవాలంటే

CBSE 12వ తరగతి ఫలితాలు విడుదల.. ఎలా చూసుకోవాలంటే

సీబీఎస్ఈ ( CBSE) 12వ తరగతి ఫలితాలను అధికారులు వెల్లడించారు. ఫలితాల కోసం డిజి లాకర్(DigiLocker), ఉమాంగ్ (UMANG) అనే యాప్ లు లేదా cbseresults.nic.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చని తెలిపారు. స్కోర్‌కార్డ్‌లను డౌన్ లోడ్ చేసుకోవడానికి సంబంధించిన లింక్‌లు త్వరలోనే యాక్టివేట్ చేయబడనున్నట్టు వెల్లడించారు. బోర్డు ఈ ఫలితాలను IVRS, SMS ద్వారా తెలుసుకోవచ్చని ప్రకటించారు.

విద్యార్థులు తమ మార్కులను results.cbse.nic.in, cbseresults.nic.in లేదా digilocker.gov.inలో రోల్ నంబర్, పాఠశాల నంబర్, అడ్మిట్ కార్డ్ ID, పుట్టిన తేదీని ఉపయోగించి తెలుసుకోవచ్చు. CBSE విద్యార్థులు డిజిలాకర్ ఖాతాలను యాక్టివేట్ చేయడానికి ఆరు అంకెల సెక్యూరిటీ పిన్‌లను జారీ చేసింది. వీటిని పాఠశాలలు వారి LOC ఆధారాలను digilocker.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ సెక్యూరిటీ పిన్‌లను ఉపయోగించి తమ మార్కుల షీట్‌లు, ధృవపత్రాల డిజిటల్ కాపీలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.