గూగుల్ కు రూ. 1,338 కోట్ల ఫైన్​

గూగుల్ కు  రూ. 1,338 కోట్ల ఫైన్​

న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్​ మొబైల్ డివైసెస్​లో గుత్తాధిపత్యానికి పాల్పడుతోందనే ఆరోపణల మీద కాంపిటీషన్​ కమిషన్​ ఆఫ్​ ఇండియా (సీసీఐ) గూగుల్​పై  రూ. 1,338 కోట్ల ఫైన్​ విధించింది. ఈ ఓపెన్​సోర్స్​ ఆండ్రాయిడ్​ మొబైల్​ ఆపరేటింగ్​ సిస్టమ్​ను స్మార్ట్​ఫోన్లు, టాబ్లెట్లు తయారు చేసే  ఒరిజినల్​ ఎక్విప్​మెంట్​ మాన్యుఫాక్చరర్లు (ఓఈఎం) ఇన్​స్టాల్​ చేస్తున్నారు. వ్యాపారంలో అక్రమాలకు పాల్పడవద్దంటూ గూగుల్​కు  హెచ్చరికలను కూడా సీసీఐ జారీ చేసింది.​

ఇచ్చిన గడువులోగా ఈ కంపెనీ పద్ధతులు మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అన్​–ఇన్​స్టాల్​ చేయడానికి వీలు కాని రీతిలో గూగుల్​ మొబైల్​ సూట్​ (జీఎంఎస్)ను ముందుగానే డివైస్​లలో ఇన్​స్టాల్​ చేసి ఇవ్వడం పట్ల సీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.