అడ్జంక్ట్‌‌ ఇంజినీర్​ పోస్టుల భర్తీ

అడ్జంక్ట్‌‌ ఇంజినీర్​ పోస్టుల భర్తీ

సెంటర్‌‌ ఫర్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ అడ్వాన్స్​డ్‌‌ కంప్యూటింగ్‌‌ (సీ-డ్యాక్‌‌) అడ్జంక్ట్‌‌ ఇంజినీర్​ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది. మొత్తం 104 ఖాళీలు ఉన్నాయి. 

పోస్టులు: సాఫ్ట్‌‌వేర్‌‌ ఆర్కిటెక్ట్‌‌, ప్రాజెక్ట్‌‌ మేనేజర్లు, సీనియర్‌‌ డెవలపర్‌‌, డేటా సెంటర్‌‌ మేనేజర్‌‌, టెక్నికల్‌‌ లీడ్‌‌, డేటా సైంటిస్టులు, ఐటీ సర్వీస్‌‌ డిజైన్‌‌ ఆర్కిటెక్ట్‌‌, బిజినెస్‌‌ అనలిస్ట్‌‌.

విభాగాలు: సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ సర్వీసెస్‌, ఐఓటీ టెక్నాలజీస్‌, మొబైల్‌ సెక్యూరిటీ, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌ తదితరాలు

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్‌‌/ ఎంసీఏ/ పీజీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్‌‌ నాలెడ్జ్‌‌ తప్పనిసరిగా ఉన్న వాళ్లకే అవకాశం ఉంటుంది. 

ఖాళీలున్న ప్రదేశాలు: ముంబయి, జమ్మూ, ఢిల్లీ, పుణె, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై.

సెలెక్షన్​ ప్రాసెస్: విద్యార్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌‌లిస్ట్‌‌ చేసి, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌‌లైన్​లో జులై 18 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.cdac.in వెబ్​సైట్​ సంప్రదించాలి.