- 26 నుంచి సెల్ఫ్ హౌస్ హోల్డ్ ఎన్యూమరేషన్ ప్రారంభం
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో త్వరలో నిర్వహించనున్న జనగణన ప్రక్రియకు సంబంధించి హౌస్ లిస్టింగ్ బ్లాక్(హెచ్ఎల్ బీ)ల ఏర్పాటు, సిబ్బంది నియామకంపై జీహెచ్ఎంసీ కమిషనర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ ఆర్వీ కర్ణన్ బుధవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో సమీక్షించారు. ఎలక్షన్స్ అడిషనల్ కమిషనర్ కె చంద్రకళ, జోనల్ కమిషనర్లు, 60 సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు (చార్జ్ సెన్సస్ ఆఫీసర్లు), కంటోన్మెంట్ అధికారులు పాల్గొన్నారు.
బ్లాకుల ఏర్పాటులో స్లమ్స్, నాన్-స్లమ్ ప్రాంతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కలపకూడదన్నారు. గురువారంలోగా ఆ వివరాలను సీఎంఎంఎస్ పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలన్నారు. ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు సర్కిల్ స్థాయిలో ఏప్రిల్ 18 నుంచి మే 5 వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజలు స్వయంగా వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునే ‘సెల్ఫ్ హౌస్‌హోల్డ్ ఎన్యూమరేషన్’ ప్రక్రియ ఈ నెల 26 నుంచి మే 9 వరకు కొనసాగుతుందన్నారు.
