కోవిడ్ సురక్షా మిషన్ కు రూ.900 కోట్ల ప్యాకేజీ

కోవిడ్ సురక్షా మిషన్ కు రూ.900 కోట్ల ప్యాకేజీ

భారత ప్రభుత్వం మిషన్‌ కోవిడ్‌ సురక్ష- ఇండియన్‌ కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌ కోసం రూ.900 కోట్లతో మూడవ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. వ్యాక్సిన్ల పరిశోధన, అభివృద్ధి కోసం బయోటెక్నాలజీ విభాగానికి (DBT) ఈ గ్రాంట్‌ అందించనున్నారు. చికిత్స విధానం అభివృద్ధి కోసం కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌ వేగవంతమైన ఉత్పత్తికి అవసరమైన నిధుల వనరులను అందిస్తోంది. 5-6 వ్యాక్సిన్‌ అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందని కేంద్ర శాస్త్రసాంకేతిక విజ్ఞాన మంత్రిత్వశాఖ తెలిపింది.

ప్రీ క్లినికల్‌, క్లినికల్‌ డెవలప్‌మెంట్‌ను వేగవంతం చేయడం తో పాటు ప్రస్తుతం క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్న లేదా క్లినికల్‌ దశలో అభివృద్ధి చెందడానికి సిద్ధంగా ఉన్న కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ క్యాండిడేట్‌ లైసెన్స్‌, క్లినికల్‌ ట్రయల్స్‌ సైట్‌లను ఏర్పాటు చేస్తోంది. కేంద్ర ప్రయోగశాలలు, అధ్యయనాలకు అనువైన సౌకర్యాలు, ఉత్పత్తి సౌకర్యాలు,ఇతర పరీక్ష సౌకర్యాలను బలోపేతం చేయడంలో భాగంగా కోవిడ్‌ సురక్ష మిషన్‌ మొదటి దశకు 12 నెలల కాలానికి రూ.900 కోట్లు కోటాయించినట్లు తెలిపింది.

మిషన్‌ కోవిడ్‌ సురక్ష మన దేశానికి స్వదేశీ, సరసమైన ధరలకు వ్యాక్సిన్ల అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బయో టెక్నాలజీ విభాగం కార్యదర్శి, ఛైర్‌పర్సన్‌ బిరాక్‌ డాక్టర్‌ రేణుస్వరూప్‌. ఇది ఆత్మ నిర్భర్‌ భారత్‌ జాతీయ మిషన్‌ను సంపూర్ణం చేస్తుందన్నారు.