బ్రేకింగ్: కిడ్నాప్ కేసులో పోలీసుల అదుపులోకి ఎమ్మెల్యే రేవణ్ణ

బ్రేకింగ్: కిడ్నాప్ కేసులో పోలీసుల అదుపులోకి ఎమ్మెల్యే రేవణ్ణ

కర్ణాటకలో సెక్స్ స్కాండిల్ కేసు హాట్ టాపిక్‌గా మారింది. తీగ పట్టుకొని లాగితే డొక్కంతా కదిలినట్టు ఒక్కొక్కటిగా విషయాలన్ని బయటకు వస్తున్నాయి.  మాజీ ప్రధాని హెచ్ డి దేవగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్ అనేక మంది మహిళలపై లైగింక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు ఇస్తున్నారు. హెచ్‌డీ రేవణ్ణపై బెంగళూరులోని కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదైంది. శనివారం ఆయన్ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే రేవణ్ణను అదుపులోకి తీసుకున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు తెలిపారు.