మిస్సింగ్ కేసు నమోదైన కాంగ్రెస్ లీడర్ డెడ్‌బాడీ లభ్యం

మిస్సింగ్ కేసు నమోదైన కాంగ్రెస్ లీడర్ డెడ్‌బాడీ లభ్యం

రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ లీడర్ మే 4 శవమై కనిపించాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరునన్వేలిలో చోటుచేసుకుంది. కేపీకే జయకుమార్ తిరునల్వేలి తూర్పు జిల్లా శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. జయకుమార్ గురువారం అదృశ్యమయ్యాడని, మరుసటి రోజు అతని కుమారుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు ఆయన పొలంలో మృతదేహం లభ్యమైంది. దీంతో పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరణంపై దర్యాప్తు చేపట్టారు. 

ఆయన డెడ్ బాడీతోపాటు ఓ సూసైడ్ లెటర్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ లెటర్ ఆయనే రాశారా, లేక ఎవరైనా రాశారా అన్నాకోణంలో పోలీసులు ఇన్వెస్టిగేష్ చేస్తున్నారు.జయకుమార్ హత్యా లేక ఆత్మహత్యా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆ సూసైడ్ లెటర్ లో ఆయన కొందరి పేర్లు రాసి, వాళ్లు ఆయన్ని బెదిరిస్తు్న్నారని రాశారు.  ఈ అనుమానాస్పద మృతిపై రాష్ట్రంలోని అధికార డీఎంకే ప్రభుత్వంపై అన్నాడీఎంకే మండిపడింది. అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జయకుమార్ మృతికి తమిళనాడు కాంగ్రెస్ చీఫ్, శ్రీపెరంబుదూర్ ఎమ్మెల్యే కె సెల్వపెరుంతగై సంతాపం తెలిపారు.