రైతుల రుణం తీర్చుకోకపోతే ఈ జన్మ వృథా: సీఎం రేవంత్

రైతుల రుణం తీర్చుకోకపోతే ఈ జన్మ వృథా: సీఎం రేవంత్

పాలమూరులోని కురుమూర్తి స్వామి సాక్షిగా పంద్రాగస్టులోపు2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.   రుణమాఫీ చేసి పాలమూరు ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు.  రైతుల రుణం తీర్చుకోకపోతే ఈ జన్మ వృథా అని అన్నారు. తాను మాటిస్తే   తప్పబోనన్నారు. సిద్దిపేటకు హరీశ్ శనిలాగ పట్టారని.. రుణమాఫీ చేసి  ఆ శనిని తొలగిస్తానని చెప్పారు. రాజీనామా లెటర్  రెడీగా పెట్టుకోవాలని హరీశ్ కు సూచించారు రేవంత్.    

మహబూబ్ నగర్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.    తాను  వారసత్వంగా  రాజకీయాల్లోకి రాలేదన్నారు.   వనపర్తిలో గెలుపు కోసం నేను గల్లీగల్లీ తిరిగా.  పాలమూరు జిల్లాలో 14 సీట్లకు 12 సీట్లిచ్చి ఆశీర్వదించారు. పాలమూరుకు మరోసారి ఇలాంటి అవకాశం రాదు.  70 ఏండ్ల తర్వాత పాలమూరు బిడ్డ సీఎం అయ్యిండు. పాలమూరుకు సోనియాగాంధీ అత్యున్నత పదవిచ్చారు.  కుర్చీ ఎక్కీ 150 రోజులు కాలేదు కుట్రలు చేస్తున్నారు. కూలగొడుతాం అంటూ పిచ్చికూతలు కూస్తున్నారు.  రాజకీయాలు పక్కన పెట్టి జిల్లా అభివృద్దికి కలిసి రావాలని చెప్పానన్నారు రేవంత్.   

బీజేపీ తెలంగాణకు ఇచ్చింది.. మోదీ తెచ్చింది ఏమీ లేదు.. గాడిద గుడ్డు తప్పా అని అన్నారు రేవంత్. గా డిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు.  పాలమూరు జిల్లాలో బీజేపీని పాతరేయాలి.  మహబూబ్ నగర్లో వంశీ చంద్ రెడ్డిని , నాగర్ కర్నూల్ లో మల్లు రవిని లక్ష మెజారిటీతో గెలిపించాలి కోరారు.