జీడిమెట్ల, వెలుగు: పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఐదో అంతస్తు భవనం పైనుంచి పడి ఓ సెంట్రిక్ కార్మికుడు చనిపోయాడు. మహరాష్ట్రకు చెందిన మహేశ్ దేవరావ్ షిండే(33) ఉపాధి కోసం వచ్చి కాప్రాలో ఉంటూ పేట్ బషీరాబాద్ లో సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కాంట్రాక్టర్, బిల్డింగ్ ఓనర్ చెప్పడంతో సోమవారం ఉదయం మహేశ్ దేవరావ్ ఐదో అంతస్తుపై సెంట్రింగ్ పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో తోటికార్మికులు అతన్ని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

