హైదరాబాద్, వెలుగు: సెప్టెంబర్ 17 సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు పేర్లతో అధికారికంగా వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ‘ప్రజా పాలనా దినోత్సవం’గా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను నిర్వహిస్తున్నది. పబ్లిక్ గార్డెన్లో సీఎం రేవంత్ రెడ్డి జెండా ఆవిష్కరించనున్నారు.
ఆయా జిల్లా కలెక్టరేట్లలోనూ మంత్రులు, సలహాదారులు జెండా ఎగరవేయనున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఈ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’ పేరిట సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహిస్తోంది. ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతుండగా, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో పారామిలిటరీ బలగాల కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
