మేడారం జాతరపై కేంద్రం చిన్నచూపు..మంత్రి కొండా సురేఖ

మేడారం జాతరపై కేంద్రం చిన్నచూపు..మంత్రి కొండా సురేఖ

వరంగల్‍, వెలుగు: ప్రపంచ గుర్తింపు పొందిన మేడారం జాతరను కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం హుండీ లెక్కింపును ప్రారంభించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్ర ప్రభుత్వం మేడారం అభివృద్ధి పనులకు పూనుకుందని, కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. ఈసారి రెండున్నర కోట్ల మంది భక్తులు తల్లులను దర్శించుకున్నట్లు తెలిపారు.