సమగ్ర శిక్ష నిధులపై కేంద్రం నజర్..ఇకపై ‘ఎస్ఎన్ఏ స్పర్శ్’ ద్వారానే ఫండ్స్ రిలీజ్ 

సమగ్ర శిక్ష నిధులపై కేంద్రం నజర్..ఇకపై ‘ఎస్ఎన్ఏ స్పర్శ్’ ద్వారానే ఫండ్స్ రిలీజ్ 
  • ఫెషియల్ అటెండెన్స్ ఉంటేనే డైట్ ఛార్జీలు చెల్లింపు
  • డైరెక్ట్​గా వెండర్లు, సప్లయర్ల ఖాతాల్లోకే నిధులు
  • కేంద్ర ఆదేశాలకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు 

హైదరాబాద్, వెలుగు: సమగ్ర శిక్షా అభియాన్ ఫండ్స్ వినియోగం, పంపిణీలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. నిధుల మళ్లింపునకు ఎక్కడా తావులేకుండా సెంట్రల్ గవర్నమెంట్ జారీ చేసిన పక్కా గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఇకపై సమగ్ర శిక్ష నిధులన్నీ కేంద్ర ప్రభుత్వ ‘ఎస్ఎన్​ఏ స్పర్శ్’ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్ ద్వారానే ‘జస్ట్ ఇన్ టైమ్’ పద్ధతిలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. దీంతో ప్రతి పైసా వినియోగంపై కేంద్రం నిఘా ఉండనుంది.

బయోమెట్రిక్ ఉంటేనే పైసలు..

హాస్టళ్లలో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా డైట్, కాస్మెటిక్ ఛార్జీల చెల్లింపుల్లో నిబంధనలను కఠినతరం చేశారు. కేజీబీవీలు, హాస్టళ్లలో స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌కు ఫెషియల్ రికగ్నిషన్ (ఎఫ్ఆర్​ఎస్) ద్వారా నమోదైన అటెండెన్స్ ఉంటేనే డైట్ ఛార్జీల బిల్లులను పాస్ చేస్తారు. మాన్యువల్ అటెండెన్స్‌‌‌‌‌‌‌‌ను ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోరు. అలాగే, ఏవైనా వస్తువులు లేదా సేవల కొనుగోలుకు సంబంధించి నగదును నేరుగా వెండర్లు, సప్లయర్ల బ్యాంకు ఖాతాల్లోకే జమ చేయాలని ఆదేశించారు. ఆఫీసర్లు తమ పర్సనల్ అకౌంట్లలో నిధులు నిల్వ చేయడానికి వీల్లేదని, ఇలా చేస్తే రూల్స్ ఉల్లంఘించినట్లుగా పరిగణిస్తామని సమగ్ర శిక్ష ఎస్​పీడీ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీచేశారు.

అన్నీ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ లెక్కలే..

2026-–27 విద్యా సంవత్సరం నుంచి నిధులన్నీ ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా పీఏఓ లేదా ట్రెజరీల నుంచే డ్రా చేయాల్సి ఉంటుంది. రూ. 25 వేల కంటే ఎక్కువ విలువైన బిల్లులకు జీఎస్‌‌‌‌‌‌‌‌టీ నంబర్ తప్పనిసరి చేశారు. ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్‌‌‌‌‌‌‌‌ఎంలు తమ పరిధిలోని గ్రాంట్లపై డ్రాయింగ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తూ, నిధుల వినియోగంపై ఎప్పటికప్పుడు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో లెక్కలు చూపాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి వచ్చే నిధులను ఇతర విభాగాల అవసరాలకు మళ్లించడంపై కూడా పూర్తిస్థాయిలో నిషేధం విధించారు.