తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ.. మెట్రో నిర్లక్ష్యం, ట్రిపుల్ ఆర్కు బ్రేకులు.. గుజరాత్, ఏపీ మెట్రోలకు మాత్రం గ్రీన్సిగ్నల్

తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ.. మెట్రో నిర్లక్ష్యం, ట్రిపుల్ ఆర్కు బ్రేకులు.. గుజరాత్, ఏపీ మెట్రోలకు మాత్రం గ్రీన్సిగ్నల్

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఉత్తర భాగానికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వకుండా కేంద్రం కొర్రీలు పెడుతున్నది. సౌత్ పార్ట్​కు అప్రైజల్​ అప్రూవల్​ ఇచ్చినా రెండేండ్లుగా కేంద్ర కేబినెట్​ ఆమోదం లభించడం లేదు.  

అదే రాజధాని అమరావతితో పాటు విజయవాడ నగరాల భవిష్యత్ రవాణా అవసరాలను తీర్చేందుకు ప్రతిపాదించిన 189 కిలోమీటర్ల భారీ ఔటర్ రింగ్ రోడ్డు  ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

నేషనల్ హైవేస్  ఆధ్వర్యంలో  చేపట్టనున్న ఈ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌వే ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో  నిధులను సైతం కేటాయించింది. ఈ మెగా ఓఆర్ఆర్ నిర్మాణంలో  భూసేకరణ  ప్రక్రియకు అయ్యే మొత్తం ఖర్చులో 50 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వమే భరించేందుకు అంగీకరించింది. దీనికి సంబంధించిన అధికారిక చర్చలు, సాంకేతిక ఒప్పందాలు ముగింపు దశకు చేరుకున్నాయి.

  • మన మెట్రో పక్కనపెట్టి.. గుజరాత్, ఏపీలకు గ్రీన్ సిగ్నల్ 

హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ అనుమతులపై కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఏడాది కింద సమర్పించిన డీపీఆర్‌‌‌‌‌‌‌‌లు, నెలన్నర క్రితం రాష్ట్ర ప్రభుత్వం మెట్రోను  టేకోవర్ చేసి పంపిన ఫైల్‌‌‌‌‌‌‌‌పై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి ఎలాంటి స్పందన లేదు.

 వాస్తవానికి తెలంగాణలో మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ఫేజ్​ 1ను టెకోవర్​ చేసింది.  విస్తరణలో భాగంగా  రూ. 24,269 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో ఫేజ్-2 విస్తరణకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసింది.