హైదరాబాద్: జులై 26న కాంగ్రెస్ ఎస్సీ సెల్ చలో మల్లారం కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. భూపాలపల్లి జిల్లా మల్లారంలో దళిత యువకుడు రెవెలి రాజబాబు హత్య కు నిరసనగా చలో మల్లారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం గాంధీభవన్ లో చలో మల్లారం పోస్టర్ ను పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేశారు.
