Trisha: సోషల్ మీడియాలో త్రిష ఓల్డ్ వీడియో వైరల్.. సీఎం అవుతానంటూ బోల్డ్ కామెంట్

Trisha: సోషల్ మీడియాలో త్రిష ఓల్డ్ వీడియో వైరల్.. సీఎం అవుతానంటూ బోల్డ్ కామెంట్

తమిళనాడులో విజయ్ స్థాపించిన TVK పార్టీ విజయం వైపు పరుగులు తీస్తోంది. ప్రస్తుతం 107 స్థానాల్లో ఉన్న టీవీకే మ్యాజిక్ ఫిగర్కు దగ్గరైంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా విజయ్తో పాటుగా హీరోయిన్ త్రిష పేరు కూడా ట్రెండ్ అవుతోంది. దీనికి ప్రధాన కారణం గతంలో త్రిష.. వచ్చే పదేళ్లలో తమిళనాడు సీఎం అవుతానని ఒక పాత ఇంటర్వ్యూలో చెప్పింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతూ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.

త్రిష పొలిటికల్ ఎంట్రీ ఫిక్సా!

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పులు జరుగుతున్న నేపథ్యంలో, త్రిష వీడియోను నెటిజన్లు మళ్లీ బయటకు తీసుకొచ్చి షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె విజయ్‌ పార్టీలో చేరి, విజయ్ గెలిచినా రెండు స్థానాల్లో, ఎక్కడో ఒకచోటు నుంచి పోటీలో నిలబడతారని ప్రచారం జరుగుతుంది. అలా, ఎమ్మెల్యేగా గెలిచి TVK పార్టీకి స్సెషల్ అట్రాక్షన్గా నిలువనుందని తమిళ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఆమె విజయ్ ఇంటికి వెళ్లడంతోనే ఇది పూర్తిగా నిజమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

అయితే, ఈ వాదనలకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. త్రిష రాజకీయాల్లోకి రావడం గానీ, TVKలో చేరడం గానీ అధికారికంగా ప్రకటించబడలేదు. కాబట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం జస్ట్ రూమర్స్ అనే చెప్పాలి. కానీ, విజయ్, త్రిష రిలేషన్ షిప్లో ఉన్నారనే పుకార్లు మరింత నిజమయ్యాయని మాత్రం తెలుస్తోంది. ఇకపోతే, విజయ్ అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ అయిన 118 స్థానాలను గెలుచుకోవాల్సి ఉంది.