వైరల్ అవుతున్న రజనీకాంత్ హాట్ కామెంట్స్: టీవీకే గెలుపు పై సోషల్ మీడియాలో చర్చ..

వైరల్ అవుతున్న రజనీకాంత్ హాట్ కామెంట్స్: టీవీకే గెలుపు పై సోషల్ మీడియాలో చర్చ..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రస్తుతం ఉత్కంఠభరితంగా సాగుతోంది. గత కొన్ని నెలలుగా ఎన్నో మలుపులు తిరిగిన రాజకీయాలు, ఇప్పుడు ఓట్ల లెక్కింపు రోజున పతాక స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా దళపతి విజయ్ పెట్టిన టీవీకే (TVK) పార్టీ చాలా చోట్ల ఆధిక్యంలో ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

రజనీకాంత్ vs ఆధవ్ అర్జున
కొన్ని నెలల క్రితం హీరో రజనీకాంత్‌కు, టీవీకే నాయకుడు ఆధవ్ అర్జున‌కు మధ్య ఒక చిన్న యుద్ధం జరిగింది. అప్పట్లో రజనీకాంత్‌ను ఉద్దేశించి ఆధవ్ అర్జున చేసిన కామెంట్లకు, రజనీ తనదైన స్టయిల్లో "కాలం ఇప్పుడు మాట్లాడదు.. అది సరైన సమయం కోసం చూసి సమాధానం చెబుతుంది" అని కౌంటర్ ఇచ్చారు. అప్పట్లో ఈ డైలాగ్ పెద్ద సంచలనమైంది. ఇప్పుడు విజయ్ పార్టీ పుంజుకోవడంతో, సోషల్ మీడియాలో ఆ డైలాగ్ మళ్ళీ వైరల్ అవుతోంది. విజయ్ గెలుపునే కొందరు 'కాలం చెబుతున్న సమాధానం' అని పోలుస్తున్నారు.

విల్లివాక్కంలో ఏం జరుగుతోందంటే 
ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రజనీకాంత్‌తో విభేదించిన ఆధవ్ అర్జున పోటీ చేసిన విల్లివాక్కం నియోజకవర్గంతో పాటు, చాలా చోట్ల విజయ్ పార్టీ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. దీంతో రజనీకాంత్ మాటలకు ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం లేదని కొందరు విమర్శిస్తున్నారు.

సోషల్ మీడియాలో రచ్చ
ఈ ఎన్నికల ఫలితాలపై ఇంటర్నెట్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం రజనీకాంత్ ప్రభావం రాజకీయాల్లో తగ్గిపోయిందని విమర్శిసస్తుండగా... మరో వర్గం రజనీ అసలు రాజకీయాల్లోకే రాలేదు కదా, ఆయన్ని విమర్శించడం కరెక్ట్ కాదని సపోర్ట్ చేస్తున్నారు.

మొదట్లో విజయ్ పార్టీని తక్కువగా అంచనా వేసిన వారంతా ఇప్పుడు షాక్‌లో ఉన్నారు. ముఖ్యంగా యువత విజయ్‌కు బ్రహ్మరథం పట్టడం, పట్టణ ప్రాంతాల్లో ఓట్లు భారీగా పడటం, కొత్త రక్తం రాజకీయాల్లోకి రావాలని జనం కోరుకోవడం...

మొత్తం 234 సీట్ల ఫలితాలు ఇంకా పూర్తిగా రాకపోయినా, ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్ చూస్తుంటే తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైనట్లు కనిపిస్తోంది. రజనీకాంత్ చెప్పినట్టు ఆ 'కాలం' ఇచ్చే పూర్తి సమాధానం ఏంటో తెలియాలంటే మరో కొన్ని గంటలు ఆగాల్సిందే.