బీసీ స్టడీ సర్కిల్ స్టూడెంట్స్ కు స్టైఫండ్ పెంపు : స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ

బీసీ స్టడీ సర్కిల్ స్టూడెంట్స్ కు స్టైఫండ్ పెంపు : స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ

హైదరాబాద్, వెలుగు: బీసీ స్టడీ సర్కిల్ లో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న వంద మంది స్టూడెంట్స్ కు స్టైఫండ్ పెరిగింది. ప్రతి నెల ఇస్తున్న స్టైఫండ్ ను రూ.5 వేల నుంచి రూ.7 వేలకు, బుక్ ఫండ్ ను రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. వచ్చే నెల నుంచి ఆ మొత్తాన్ని స్టూడెంట్స్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రస్తుతం సైదాబాద్ లోని బీసీ స్టడీ సర్కిల్ లో వంద మంది బీసీ స్టూడెంట్స్ కు సివిల్స్ ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు. 

సివిల్స్ స్టూడెంట్స్ కు 3 ఏళ్ల పాటు కోచింగ్ ఇస్తున్నామని, వీరితో పాటు మరో వంద మందికి వివిధ పోటీ పరీక్షలకు ఫౌండేషన్ కోర్సులకు ట్రైనింగ్ ఇస్తున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 నుంచి రాత్రి 12 గంటల వరకు లైబ్రరీ అందుబాటులో ఉందని, బయట ప్రైవేట్ స్టడీ హాల్స్ కు అమౌంట్ కట్టి వెళ్లకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు  వెల్లడించారు.