Rajasekhar: జీవిత కోసం శ్రీదేవిని వదులుకున్నా.. పెళ్లిపై రాజశేఖర్ ఆసక్తికర కామెంట్స్

Rajasekhar: జీవిత కోసం శ్రీదేవిని వదులుకున్నా.. పెళ్లిపై రాజశేఖర్ ఆసక్తికర కామెంట్స్

యాంగ్రీ మాన్ రాజశేఖర్ తన వివాహానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన పెళ్లికి ముందు ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ శ్రీదేవి సంబంధం కూడా వచ్చిందని చెప్పారు. ఇంట్లోవాళ్లు ఆమెను పెళ్లి చేసుకోమన్నారని పట్టుబట్టినట్లుగా రాజశేఖర్ చెప్పుకొచ్చారు. అయితే, ఆ తర్వాత ఈ విషయాన్ని అప్పటికే ప్రేమిస్తున్న జీవితతో పంచుకున్నప్పుడు, ఆమె తన నిర్ణయానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని చెప్పారు.

‘‘శ్రీదేవి గారిని పెళ్లి చేసుకోమని మొదట నన్ను సంబంధం అడిగారు.. ఇంట్లో కూడా ఈ కులం అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అన్నారు.. వెళ్లి జీవితానికి చెప్పాను.. మీరు వేరే పెళ్లి చేసుకుంటే మీ ఇష్టం.. నేను జీవితాంతం ఒంటరిగా ఉంటాను” అని చెప్పిందని రాజశేఖర్ తెలిపారు. 

అలా నేను లేకపోతే, జీవితాంతం ఒంటరిగానే ఉంటానని జీవిత చెప్పిన మాటలు తనను ప్రభావితం చేశాయని రాజశేఖర్ వెల్లడించారు. ఆ తర్వాత జీవితనే జీవిత భాగస్వామిగా ఎంచుకున్న రాజశేఖర్, ఇప్పటికీ టాలీవుడ్‌లో ఆదర్శ దంపతులుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రాజశేఖర్ 'మగాడు'.. 

హీరోగా అనేక చిత్రాల్లో మెప్పించిన రాజశేఖర్.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఇటీవలే ‘బైకర్’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. శర్వాకు ఫాదర్‌‌‌‌గా, కోచ్‌‌గా నటించి శభాష్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం పవన్ సాధినేనితో 'మగాడు' అనే సినిమా చేస్తున్నాడు. రమ్య విశ్వదేవ్, శివానితో కలిసి మరో సినిమా చేస్తున్నాడు. కొన్ని కథలు లైన్ లో పెట్టినట్లు సమాచారం.