తమిళనాడు ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. రౌండ్ రౌండ్ ఓట్ల లెక్కింపు ఆధిక్యం దోబుచులాడుతోంది.దాదాపు100 నియోజకవర్గాల్లో ఆధిక్యం కేవలం 3 వేల ఓట్లు మాత్రమే ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో 100 నుంచి 500 ఓట్ల ఆధిక్యంలోనే ఉన్నారు అభ్యర్థులు. అత్యధికంగా లీడ్ లో ఉన్నది విజయ్ టీవీకే పార్టీ.. దీంతో అంచనాలు తారుమారు కావొచ్చనే వాదన వినిపిస్తోంది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తే తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.. ఇప్పటివరకు ఉన్న రిపోర్టుల ప్రకారం.. విజయ్ పార్టీ దాదాపు 111 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అన్నాడీఎంకే63, డీఎంకే 61 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. అయితే దాదాపు 100 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య కేవలం 3వేల కంటే తక్కువ ఓట్ల మెజార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే కొనసాగితే తుది ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది.
తమిళనాడులో అధికారం డీఎంకే పార్టీ తిరిగి అధికారం చేపడుతుందని దాదాపు ఎగ్జిట్ పోల్ సంస్థలు తమ అంచనాలను ప్రకటించాయి. అయితే యాక్సిస్ మై ఇండియా, చాణక్య వంటి సంస్తలు మాత్రం విజయ్ టీవీకే పార్టీ కి అత్యధిక సీట్లు వస్తాయని అంచనా వేశాయి. విజయ్ పార్టీకీ 98 నుంచి 120 సీట్లు వస్తాయని చెప్పారు. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో.. అధికారం చేపట్టేంత మెజార్టీ ఏ పార్టీకి తమిళ ప్రజలు ఇస్తారనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
