జంతర్ మంతర్ వద్ద నీళ్లు, కరెంట్ బంద్.. అయినా ఆందోళన విరమించని కాక్రోచ్ పార్టీ

జంతర్ మంతర్ వద్ద నీళ్లు, కరెంట్ బంద్.. అయినా ఆందోళన విరమించని కాక్రోచ్ పార్టీ

నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ భారీ ఎత్తున ధర్నా చేస్తోంది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సోమవారం (జూన్ 22) ఢిల్లీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు ఆ పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే. 

జంతర్ మంతర్ దగ్గర నీటి సరఫరా ఆపేశారని.. రెస్ట్ రూమ్ లకు నీళ్లు లేకుండా చేశారని ఆరోపించారు. వెంటనే బాత్ రూమ్ లకు నీటి సరఫరా పునరుద్ధరించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని, పోలీసులను డిమాండ్ చేశారు. 

ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తున్న తమను శత విధాలా అడ్డుకోవాలని చూస్తున్నారని.. అందులో భాగంగా నీటి సరఫరా లేకుండా చేశారని మండిపడ్డారు. అధికారులు వెంటనే రెస్ట్ రూమ్ లకు నీటి సరఫరా పునరుద్ధరించాలని కోరారు. 

ఆందోళనకు ఆధార్ ఎప్పటి నుంచి..?

అంతకు ఢిల్లీ పోలీసుల తీరును, కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు దీప్కే. జంతర్ మంతర్ వద్దకు వస్తున్న రిసనకారులను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపించారు. నిరసన కారులను ఆధార్ కార్డు చూపించాలని పోలీసులు అడుగుతున్నట్లు చెప్పారు. 

ఆందోళనలకు, ధర్నాలకు ఆధార్ కార్డు ఉండాలని రూల్ ఎప్పొడొచ్చిందో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రాజీనామా డిమాండ్ చేస్తూ.. చెప్పులు, స్టీల్ ప్లట్లు, గ్లాసులు, సూట్ కేసులతో ధర్నాకు దిగారు. 

ALSO READ : మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠీ భూమి కబ్జా.

కేంద్ర మంత్రి రాజీనామా తో పాటు.. నీట్ పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాల్సిందిగా కాక్రోచ్ పార్టీ డిమాండ్ చేస్తోంది.