తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి.ఎండలు, వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటలనుంచే సూర్యుడి ప్రతాపం కొనసాగుతుండటంతో జనం బయటకురావాలంటే భయపడుతున్నారు. ఆదివారం (మే 3) అన్ని జిల్లాలో 40 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వరంగల్, భూపాలపల్లిలో46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. దీంతో ఫస్ట్ టైం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు.
ఆరెంజ్ అంటే 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో ఎండలు తగ్గుముఖం పడతాయని అధికారులు చెబుతున్నప్పటికీ డిఫరెంట్ వెదర్ కనిపిస్తోంది.
మరోవైపు వర్షాలు కూడా పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మే 5, 6 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. వర్షాలతోపాటు ఈదురుగాలులు, వేడిగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
