వానాకాలం బెస్ట్ స్నాక్స్ ఏంటో తెలుసా : ఆనియన్ సమోసా, చికెన్ పకోడీ అంట..!

వానాకాలం బెస్ట్ స్నాక్స్ ఏంటో తెలుసా : ఆనియన్ సమోసా, చికెన్ పకోడీ అంట..!

వర్షాకాలం మొదలైంది.  ప్రస్తుతం సాయంకాలం వర్షాలు పడుతున్నాయి.  ఉదయం అంతా వేడిగా ఉన్నా.. సాయంత్రానికి వాతారణం కూల్​ గా మారుతుంది.  ఈ కూల్ కూల్ వెదర్ లో గరంగరం పకోడి తింటే ఆ మజానే వేరు.. అది కూడా చికెన్ పకోడి అయితే వింటుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి కదా! ఇవే కాదు ఈ చల్లగాలుల్ని తిప్పికొట్టడానికి   ఎవర్ గ్రీన్ చిట్టి సమోసాలను  ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.  .!


చికెన్ పకోడి తయారీకి కావాల్సినవి

  • బోన్ లెస్ చికెన్ - పావు కేజీ
  • పుదీన, కొత్తిమీర-ఒక్కో కట్ట
  • పచ్చి మిర్చి తరుగు - ఒక టీ స్పూన్
  • అల్లం - చిన్నముక్క
  • వెల్లుల్లి - ఆరు రెబ్బలు
  • నిమ్మరసం - ఒక టీ స్పూన్
  • ధనియాల పొడి - ఒక టీస్పూన్.
  • పెరుగు - రెండు టీ స్పూన్లు
  • శెనగపిండి - అర కప్పు.
  • ఉప్పు - తగినంత
  • నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

చికెన్​ పకోడి తయారీ విధానం 

మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేయాలి. చికెన్ ను శుభ్రంగా కడిగి గిన్నెలోకి తీసుకుని. అందులో ధనియాల పొడి, గరం మసాలా-ఉప్పు, కారం, పెరుగు, నిమ్మరసం ముందుగా చేసి పెట్టుకున్న పుదీనా ముద్ద వేసి బాగా కలపాలి. గంట తర్వాత ఒక టేబుల్ స్పూన్ వేడినూనె. శెనగపిండి కూడా వేయాలి. నూనెవేడి చేసి చికెన్ మిశ్రమాన్ని పకోడిల్లా వేయాలి. అయితే పకోడీలు క్రంచీగా కరకరలాడాలంటే శెనగపిండితోపాటు కొద్దిగా మొక్కజొన్న పిండి కూడా కలపాలి.

 

ఆనియన్ సమోసా తయారీకి కావాల్సినవి

  • మైదా పిండి- రెండు కప్పులు 
  • కారం, ఉప్పు- తగినంత 
  • ఆలుగడ్డ ముక్కలు (ఉడికించి)- ఒక కప్పు 
  • పచ్చిమిర్చి తరుగు-రెండు టీ స్పూన్లు 
  • ఉల్లిగడ్డ ముక్కలు- ఒక టేబుల్ స్పూన్ 
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
  • కొత్తిమీర-కొద్దిగా, ధనియాల పొడి - ఒక టీ స్పూన్, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
  • మైదా పేస్ట్-కొద్దిగా

 ఆనియన్​ సమోసా తయారీ విధానం 

ముందుగా మైదాలో ఉప్పువేసి, తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి. ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చపాతీల్లా ఒత్తి పెనంపై రెండు వైపులా కొద్దిగా కాల్చాలి. ఆ చపాతీలని పొడవు రిబ్బన్ ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు పాన్​ లో కొద్దిగా నూనె వేడిచేసి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ తరుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగించాలి. అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, ఉడికించిన ఆలుగడ్డ తరుగు, కొత్తిమీర వేసి బాగా కలపాలి.ఇప్పుడు ముందుగా కట్ చేసిన ముక్కలను కోన్​ లో చుట్టి మధ్యలో ఆలుగడ్డ మిశ్రమం పెట్టాలి. చివర్లు మైదా పేస్ట్ అతికించి డీప్ ఫ్రై చేయాలి. అంతే ఆనియన్ సమోసా రెడీ.