Simone Kelly: న్యూయార్క్ నిక్స్ (New York Knicks, Basketball) ఛాంపియన్‌షిప్ గెలిచిన ఆనందంలో మ్యాన్‌హట్టన్ వీధులన్నీ పరేడ్‌తో మార్మోగిపోతుంటే.. అక్కడొక మైండ్ బ్లాక్ సీన్ చోటు చేసుకుంది. గుంపులో ఉన్న ఒకడికి సడన్‌గా ఏమైందో ఏమో గానీ.. కళ్లు తిరిగి పడిపోతూ ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. సరిగ్గా అదే టైమ్‌లో అక్కడే పరేడ్ చూస్తున్న సిమోన్ కెల్లీ (Simone Kelly) అనే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (EMT) దేవతలా వచ్చి వాడిని కాపాడింది. అయితే తీరా స్పృహ వచ్చాక ఆ ప్రథమ చికిత్స చేసిన అమ్మాయితో వాడు చేసిన నిర్వాకం చూస్తే.. అరెరే.. వీడికి ట్రీట్‌మెంట్ చేసి కూడా వెస్ట్ అనకుండా ఉండలేరు.
చస్తున్నాడని ట్రీట్‌మెంట్ ఇస్తే.. ముద్దు పెట్టడానికి ట్రై చేశాడు:
సౌత్ ఆరెంజ్ రెస్క్యూ స్క్వాడ్‌లో పని చేసే సిమోన్ కెల్లీ.. తన ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉపయోగించి, ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్న అతడ్ని కోలుకునేలా చేసింది. చుట్టూ జనం కంగారుగా చూస్తున్నారు. కట్ చేస్తే.. కాసేపటికి మనోడికి మెల్లగా స్పృహ వచ్చింది. అంతే, కళ్లు తెరవగానే ప్రాణం కాపాడినందుకు థాంక్స్ చెప్పడం మానేసి.. తల తిప్పి ఎదురుగా ఉన్న సిమోన్ కెల్లీ అందాన్ని చూసి ఫ్లాట్ అయిపోయాడు.. ఇంకేముంది.. లవ్‌లో పడిపోయినట్లు బిల్డప్ ఇస్తూ, ఆమెకు ముద్దు పెట్టేయడానికి తెగ ట్రై చేశాడు. పాపం.. ఆ అమ్మాయి షాక్ తిని, వెనక్కి తప్పుకుంటూ ఒరేయ్ బాబు.. ప్రశాంతంగా కూర్చోరా నాయనా అని నచ్చజెప్పాల్సి వచ్చింది.
లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన నెటిజన్స్:
స్పృహలోకి వచ్చిన తర్వాత అతడు చేసిన సరసాల వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఇంటర్నెట్ షేక్ అయిపోయింది. వీడియో చూసిన నెటిజన్లు ఆ కామాంధుడిని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఒరేయ్ ఎదవ.. నిన్ను కాపాడటానికి వచ్చిందిరా ఆమె, నీకు లవర్ కాదు, ప్రాణం పోయే టైమ్‌లో కూడా నీకు ఆ బుద్ధులు పోలేదు చూడు.. నిన్ను అట్లే వదిలేయాల్సిందంటూ విమర్శలు గుప్పించారు. ఏది ఏమైనా, సిమోన్ కెల్లీ మాత్రం ఏమాత్రం సహనం కోల్పోకుండా, సిట్యుయేషన్‌ను హ్యాండిల్ చేసింది.
ALSO READ : నెయ్‌మార్ ఆడతాడా లేదా?
Knicks fan passed out at the parade, a woman saves his life and bro IMMEDIATELY tries to kiss her 😭💀
— Hater Report (@HaterReport) June 18, 2026
INSANE pic.twitter.com/1Yr01dluVI
