తలనొప్పి ప్రతి ఒక్కరినీ ఏదో ఒక సమయంలో ఇబ్బంది పెడుతుంది. అదే నిద్ర లేవడంతోనే తలనొప్పి వస్తే ఒక సాధారణ సమస్యగా మారే అవకాశం ఉంది. సరిగా నిద్ర లేకపోవడం.. అసవసర విషయాల గురించి ఆలోచించడం డీహైడ్రేషన్, అధికంగా మద్యం సేవించడం, ఒత్తిడి కూడా తలనొప్పికి కారణమవుతాయి. తరచుగా ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. చాలా మంది తలనొప్పిని వదిలించుకోవడానికి వివిధ నివారణలను ప్రయత్నిస్తారు.. అయితే ఆవిరితో తలనొప్పిని ఎలా తగ్గించుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
రోజూ నిద్రలేవడంతోనే తలనొప్పిగా ఉంటోందా? అయితే లైట్ తీసుకోవద్దు. తలనొప్పికి కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. తలనొప్పిగా ఉందంటే రాత్రి సరిగ్గా నిద్రపోక పోవడం, రాత్రుళ్లు ఎక్కువ సార్లు మెలకువ రావడం కూడా కారణం కావచ్చు. బెడ్ రూమ్ లో వెలుతురు ఉంటే కూడా కొందరికి నిద్రపట్టదు. అది కూడా తలనొప్పికి కారణమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. .
నిజానికి ఉదయం లేవగానే తలనొప్పి ఉండకూడదు. ఎందుకంటే రాత్రంతా మన బాడీ, మనసు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటాయి. అయినా నిద్రలేవగానే తలనొప్పి వస్తుందంటే శరీ రానికి పూర్తి విశ్రాంతి దొరకడం లేదని అర్ధం చేసుకోవాలి. వీలైనంత వరకు త్వరగా నిద్రపో వడం అలవాటు చేసుకోవాలి. తొమ్మిది గంటలకల్లా బెడ్ పైకి చేరితే సరిపడా నిద్ర లభిస్తుంది. ఇవన్నీ పాటించినా తలనొప్పి ఉందంటే ఆవిరి పట్టాలి. యూకలిప్టస్ ఆయిల్‌ను వేడి నీళ్లలో వేసి ఆవిరి పడితే ఫలితం కనిపిస్తుంది. అప్పటికీ మార్పు కనిపించకపోతే ఒకసారి డాక్టర్‌ను కలిసి చెకప్ చేయించుకోవాల్సిందే..
