పదవుల కోసం పార్టీ మారుతరా? : కాంగ్రెస్ నేత చనగాని దయాకర్

పదవుల కోసం పార్టీ మారుతరా? : కాంగ్రెస్ నేత చనగాని దయాకర్
  • కాంగ్రెస్ నేత చనగాని దయాకర్

హైదరాబాద్, వెలుగు: పదవులు రానంత మాత్రాన పార్టీ మారడమనేది ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ అన్నారు. శనివారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 

జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత కేవలం రాజ్యసభ ఎంపీ పదవి దక్కలేదన్న అసంతృప్తితో కాంగ్రెస్ ను వీడటం దురదృష్టకరమన్నారు. పార్టీలో తనతోపాటు వందలాది మంది సీనియర్లు ఏండ్ల తరబడి పని చేస్తున్నారని, పదవులు ఆశిస్తున్నారని తెలిపారు. అవి రాకపోతే అసంతృప్తి ఉండటం సహజమని, అయితే, తాము జీవన్​రెడ్డిలా పార్టీ మారడం లేదు కదా అన్నారు.