హాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్టు

హాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్టు

చందానగర్​, వెలుగు :  వైజాగ్​ నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  హాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్​పోర్ట్​ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను చందానగర్​ పోలీసులు అరెస్ట్​ చేశారు.  వీరి నుంచి రూ. 4  లక్షల విలువైన 760  గ్రాముల హాష్‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్​ఐ రఘు తెలిపిన వివరాల ప్రకారం..  శ్రీకాకుళం జిల్లా తుర్కపేట గ్రామానికి చెందిన ప్రవీణ్​కుమార్​(32) అల్లాపూర్‌‌లో నివాసముంటున్నాడు.  విశాఖపట్నం అల్లిపోరం గ్రామానికి చెందిన సాయికుమార్​(28) స్థానికంగా బిర్యానీ అమ్ముతుంటాడు.  వీరిద్దరూ కలిసి విశాఖపట్నానికి  చెందిన రాజారావు వద్ద హాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కొనుగోలు చేసి అక్కడి నుంచి ట్రైన్​లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చారు.   

ఆదివారం రాత్రి లింగంపల్లి  రైల్వేస్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దిగిన ఇద్దరు కూకట్​పల్లి వెళ్లేందుకు ఆటో మాట్లాడుకొని బయలుదేరారు.  లింగంపల్లి  రైల్వే అండర్​బ్రిడ్జి వద్ద వెహికిల్​చెకింగ్​ చేస్తున్న చందానగర్​ పోలీసులను చూసిన  ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సాయి ఆటో దిగి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఇద్దరి వద్ద ఉన్న బ్యాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయగా 760 గ్రాముల హాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుర్తించారు.  ప్రవీణ్​ వైజాగ్​ నుంచి హాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో ఉన్న కస్టమర్లకు విక్రయించేందుకు తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు.  ఇద్దరిని అరెస్ట్​ చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.