కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ముందుకు చంద్రశేఖర్రెడ్డి

కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ముందుకు చంద్రశేఖర్రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో నెలకొన్న వివాదం ఇంకా సమసిపోలేదు. పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీపై చంద్ర శేఖర్ రెడ్డి వర్గం, చంద్ర శేఖర్ రెడ్డిపై  షబ్బీర్ వర్గం పరస్పరం ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో గురువారం చంద్రశేఖర్​రెడ్డి కమిటీ ముందు హాజరై, తన వాదన వినిపించారు. అనంతరం కమిటీ వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ మీడియాతో మాట్లాడారు. త్వరలో షబ్బీర్ అలీని పిలిచి మాట్లాడుతామని, ఆ తర్వాత చంద్ర శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరోసారి కమిటీ ముందుకు పిలుస్తామని చెప్పారు. చంద్ర శేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కమిటీ తనకు న్యాయం చేస్తుందనే నమ్మకం ఉందన్నారు.