చంద్రముఖి 2 షూటింగ్ ప్రారంభం

చంద్రముఖి 2 షూటింగ్ ప్రారంభం

సూపర్ స్టార్ రజనీకాంత్ ను గురువుగా భావించే ఫిల్మ్ మేకర్, నటుడు రాఘవ లారెన్స్.. ఆయన ఆశీర్వాదంతో చంద్రముఖి 2 షూటింగ్‌ను ప్రారంభించారు. రజనీకాంత్ పాదాలను తాకుతూ లారెన్స్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయానా ట్విట్టర్ వేదికగా తెలిపారు. "హాయ్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్.  నా తలైవర్, గురువు గారు రజనీకాంత్ ఆశీస్సులతో ఈ రోజు చంద్రముఖి 2 షూటింగ్ మైసూరులో ప్రారంభమైంది! మీ ఆశీస్సులు నాకు కావాలి!" అంటూ రాఘవ లారెన్స్ ట్వీట్ చేస్తూ.. రజనీ కాంత్ తో దిగిన ఫొటోలను షేర్ చేశారు. వీటిల్లో లారెన్స్, రజనీకాంత్ ను కౌగిలించుకుని, నవ్వుతూ ఉన్న ఫొటో ఒకటి, మరొక ఫొటోలో ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నట్టుగా ఉండడాన్ని గమనించవచ్చు. 

ఇదిలా ఉండగా 2005లో రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కామెడీ, హార్రర్‌ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా అప్పట్లో ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత చాలా సార్లు ఈ మూవీ స్వీకెల్ పై వార్తలొచ్చాయి. గత కొన్ని రోజుల క్రితమే చంద్రముఖి 2 స్వీక్వెల్ రాబోతుందంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే పార్ట్ 1 చాలా పెద్ద హిట్ అవడంతో.. ఇప్పుడు పార్ట్ 2 పైనా అంచనాలు పెరిగే అవకాశం ఉంది.