
- భారత్ జోడో న్యాయ్ యాత్ర పై మణిపూర్ సర్కార్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టనున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రారంభోత్సవ వేదికను మార్చుకోవాలని మణిపూర్ సర్కార్ కాంగ్రెస్ లీడర్లకు సూచించింది. ఈస్ట్ ఇంఫాల్‌లో ఉన్న ప్యాలెస్ కాంపౌండ్‌లోని హట్టా కాంగ్జేబుంగ్ నుంచి ఈ నెల 14న యాత్ర ప్రారంభించాలని కాంగ్రెస్ భావించింది. ఈ మేరకు పర్మిషన్ ఇవ్వాలని కోరగా.. మణిపూర్ సర్కార్ నిరాకరించింది. ఇంఫాల్లోనే వేరే లొకేషన్ నుంచి యాత్ర ప్రారంభించుకోవాలని సూచించింది.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
ఎంపీసీసీ చీఫ్మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఎంపీసీసీ) అధ్యక్షుడు కీషామ్ మెగాచంద్ర బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘హట్టా కాంగ్జేబుంగ్ నుంచి ప్రారంభించే ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు పర్మిషన్ ఇవ్వాలని సీఎం బీరెన్ సింగ్‌ను కలిశాం. అయితే, ఆయన నిరాకరించారు. మణిపూర్‌లో శాంతిభద్రతల పరిస్థితి సున్నితంగా ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు బీరెన్ సింగ్ చెప్పారు.
హట్టా కాంగ్జేబుంగ్ నుంచి కాకుండా మరో చోటు నుంచి యాత్ర ప్రారంభించుకోవాలన్నారు” అని మెగాచంద్ర తెలిపారు. బీరెన్ సింగ్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. రూట్‌మ్యాప్ రిలీజ్ చేసిన నేతలుయాత్ర రూట్ మ్యాప్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శులు జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్ బుధవారం రిలీజ్ చేశారు. జనవరి 14న ప్రారంభమై 6,713 కి.మీ. మేర ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పారు.