చెచెన్యా: చెచెన్యా ప్రాంతంలో యూరప్‌లోనే అతిపెద్ద మసీదును ఓపెన్ అయింది. తెల్లటి మార్బుల్‌తో అందంగా కట్టిన మసీదుకు ప్రాఫెట్ మహ్మద్ పేరు పెట్టారు. మసీదు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గార్డెన్, వాటర్ ఫౌంటైన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకేసారి 30వేల మందికిపైగా ప్రార్థన చేసుకోవచ్చని నిర్వాహకులు చెప్పారు. 9,700 చదరపు మీటర్లలో దీన్ని నిర్మించారు. మసీదు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పెద్ద పూల మైదానంలో అదనంగా దాదాపు 70వేల మందికి పైగా ప్రార్థనలు చేసుకోవచ్చని అధికారి చెప్పారు. చెచెన్యా చీఫ్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ సన్నిహితుడు రంజాన్ కడిరోవ్ మసీదును ప్రారంభించారు. ముస్లిం మెజారిటీ ప్రాంతమైన చెచెన్యాకు 2007లో వ్లాదిమిర్ పుతిన్ కడిరోవ్‌ను చీఫ్‌గా నియమించారు. ఆ ప్రాంతంలో మసీదులు నిర్మించడం ద్వారా ఇస్లాం పునరుజ్జీవనానికి ఆయన కృషి చేశారు. 1991లో సోవియట్ యూనియన్ నుంచి రష్యా బయటకు వచ్చినప్పుడు మాస్కో సైనికులు, సెపరేటిస్టుల మధ్య జరిగిన యుద్ధంలో ధ్వంసమైన ‘హార్ట్ ఆఫ్ చెచెన్యా’ ను 2008లో ఆవిష్కరించారు. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ కడిరోవ్‌పై ఎన్ని ఆరోపణలు వచ్చాయి. చాలా ఏళ్ల తర్వాత తమ ప్రాంతానికి ప్రశాంతతను తీసుకొచ్చిన ఘనత కడిరోవ్‌ది అని ఆయన మద్దతుదారులు చెప్తారు.
