వైరల్ అవుతున్న ప్రభుదేవా ముక్కాలా ముక్కాబులా ‘చెందా’ సాంగ్

వైరల్ అవుతున్న ప్రభుదేవా ముక్కాలా ముక్కాబులా ‘చెందా’ సాంగ్

ప్రభుదేవా నటించిన ముక్కాలా ముక్కాబులా సాంగ్ ఎంత పాపులర్ అయిందో మనందరికే తెలిసిందే. ప్రభుదేవా, నగ్మ నటించిన ప్రేమికుడు సినిమా 1994 విడుదలయింది. ఈ సినిమాకు ఏఆర్ రహమాన్ సంగీత దర్శకత్వం వహించారు. వాలీ రాసిన ముక్కాలా ముక్కాబులా పాటకు ప్రభుదేవా డ్యాన్స్, ఏఆర్ రహమాన్ సంగీతం ప్రాణం పోశాయి.

ఇప్పుడు ఆ పాటకు కేరళలోని చెందా మేళం తమదైన శైలిలో ట్యూన్ కట్టింది. సాధారణంగా చెందా మేళం పండుగలకు, గుళ్లోలోని ప్రత్యేక కార్యక్రమాలకు వాయిస్తూ ఉంటుంది. అయితే వారు ఈ పాట కోసం ఎంతో కష్టపడి వినూత్నంగా సరికొత్త ట్యూన్ కట్టారు. అది ఇప్పుడు నెట్టింట్లో వైరల్ వీడియోగా మారింది. ఆ వీడియోను సింగర్ శ్వేతా మోహన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.