హైదరాబాద్,వెలుగు: టీజీఎస్ ఆర్టీసీలో ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (టీఎస్టీ), మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ (ఎంఎస్టీ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. టీఎస్టీ పోస్టులకు 15,796 మంది రాత పరీక్షకు హాజరుకాగా, అందులో 9,377 మంది అర్హత సాధించారు. అలాగే ఎంఎస్టీ పోస్టులకు 4,817 మంది పరీక్ష రాయగా, వీరిలో 2,755 మంది ఎంపికయ్యారు.
ఈ విషయాన్ని టీజీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ నెల 16, 17 తేదీల్లో అంబర్‌పేట్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
