ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీనాక్షికి సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీనాక్షికి సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బ్రిష్కెక్: ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా రెజ్లర్ మీనాక్షి గోయత్ సిల్వర్ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెరవగా.. మోనిక, హర్షిత బ్రాంజ్ మెడల్స్ సొంతం చేసుకున్నారు. మరో ముగ్గురు రెజ్లర్లు ఫైనల్ చేరి గోల్డ్ మెడల్ ముంగిట నిలిచారు.  శుక్రవారం జరిగిన విమెన్స్ 53 కేజీ విభాగం ఫైనల్లో మీనాక్షి 0–-10 తేడాతో చైనా రెజ్లర్ జిన్ జాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతిలో ఓటమి పాలై రజతంతో సరిపెట్టుకుంది. 65 కేజీ బ్రాంజ్ మెడల్ ప్లే ఆఫ్​ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మోనిక 9–0తో హంబిట్ లీ (సౌత్ కొరియా)ను ఓడించగా.. 72 కేజీ కాంస్య పతక పోరులో హర్షిత 5–-0తో ఉజ్బెకిస్తాన్ రెజ్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెవించోయ్ పొల్వొనోవాపై విజయం సాధించింది.

మెన్స్ ఫ్రీస్టయిల్ 65 కేజీ కేటగిరీలో అండర్-23 వరల్డ్ చాంపియన్ సుజీత్ తో పాటు  అభిమన్యు (70 కేజీ),  సందీప్ మాన్ (79 కేజీ) ఫైనల్ చేరారు. సెమీ ఫైనల్లో సుజీత్ 7–-2తో కుదియెవ్ (తజకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)ను  ఓడించగా, అభిమన్యు6–3తో డిఫెండింగ్ చాంప్  ఇర్నజార్ (కిర్గిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)పై గెలిచాడు. సందీప్ 10–-0తో సొమొజోన్ ఇక్రొమోమ్ (తజకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)ను చిత్తు చేశాడు.  

మరిన్ని వార్తలు