ఫుట్పాత్ ఆక్రమణలపై చర్యలు

ఫుట్పాత్ ఆక్రమణలపై చర్యలు

మల్కాజిగిరి, వెలుగు: మల్కాజిగిరిలో ఫుట్​పాత్‌ ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. శుక్రవారం ఆనంద్​బాగ్ చౌరస్తా నుంచి ఓల్డ్ పోలీస్ స్టేషన్ రోడ్డు వరకు రహదారుల వెంట ఉన్న అక్రమ షెడ్లు, తాత్కాలిక కట్టడాలు, దుకాణాలను జేసీబీల సహకారంతో అధికారులు తొలగించారు. భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.