రవిబాబు మరో ఎక్సయిటింగ్ మూవీ.. చలపతిరావు జయంతికి ‘రేజర్’

రవిబాబు మరో ఎక్సయిటింగ్  మూవీ.. చలపతిరావు జయంతికి ‘రేజర్’

ఫిల్మ్ మేకర్‌‌‌‌గా, నటుడిగా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న  రవిబాబు..  మరో  ఎక్సయిటింగ్‌‌ ప్రాజెక్టుతో  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  తను లీడ్‌‌గా నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘రేజర్’. సురేష్ బాబు సమర్పణలో  ఫ్లయింగ్ ఫ్రాగ్స్ సంస్థ ఈ చిత్రాన్ని  నిర్మిస్తోంది.  ఇటీవల షూటింగ్ కంప్లీట్ కాగా, తాజాగా  పోస్ట్-ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు కూడా కంప్లీట్ అయ్యాయని మేకర్స్ తెలియజేశారు. 

ఈ నేపథ్యంలో శుక్రవారం రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్ చేశారు. తన  తండ్రి చలపతి రావు జయంతి అయిన మే 8న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు  ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో ఓ ఎమోషనల్ పోస్ట్‌‌ను షేర్  చేశాడు రవిబాబు. అలాగే  ‘రేజర్’  వరల్డ్‌‌ని పరిచయం చేసేలా కొత్త పోస్టర్లను రిలీజ్ చేశారు. 

ఇంటెన్స్ లుక్‌‌లో పవర్‌‌‌‌ఫుల్‌‌గా కనిపిస్తున్న రవిబాబు గెటప్ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఎస్‌‌ఎస్ రాజేశ్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ సన్నివేశాలకు సతీష్ పోలోజు కొరియోగ్రఫీ చేస్తున్నాడు. మరోసారి రవిబాబు, సురేష్ బాబు కాంబినేషన్‌‌లో వస్తున్న ఈ సినిమాపై  అంచనాలు ఏర్పడ్డాయి.