మనిషి కాదు దేవుడే.. కిలో టమాటా రూ. 20కే అమ్మాడు

మనిషి కాదు దేవుడే.. కిలో టమాటా రూ. 20కే అమ్మాడు

దేశంలో టమాటా ధరలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే.  కిలోకు రూ. 160 పలుకుతోంది.  దీంతో టమాటాలు కోనాలంటే సామాన్యులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  కానీ ఓ వ్యాపారి మాత్రం కిలో రూ.20కే అమ్మాడు. దీంతో నిమిషాల్లోనే 550 కిలోల స్టాక్ అమ్ముడుపోయింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. 

తమిళనాడులోని కడలూరుకు చెందిన రాజేష్‌(38) అనే వ్యక్తికి కూరగాయల దుకాణం ఉంది.  ఇటీవల తన షాపు నాల్గొవ వార్షికోత్సవం సందర్భంగా పేదలకు సహాయం చేయాలని అనుకున్నాడు. అందులో భాగంగా బెంగళూరు నుంచి కిలో రూ.60 చొప్పున 550 కిలోలు టమాటాలు కొనుగోలు చేశాడు. అనంతరం వాటిని తన దుకాణంలో కిలో రూ.20కే విక్రయించాడు. ఒక వ్యక్తి ఒక కిలో మాత్రమే కొనుగోలు చేయాలని ముందుగానే సూచించాడు. 

ఈ ఆఫర్ తో జనాలు ఎగబడ్డారు. దీంతో కొన్ని నిమిషాల్లోనే మొత్తం స్టాక్ ఖాళీ అయింది. 2019లో ఉల్లిపాయల ధరలు పెరిగినప్పుడు కూడా తాను కేవలం రూ. 10 కి అమ్మానని రాజేష్ చెప్పుకొచ్చాడు.  తన షాపు వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా కూరగాయలపై డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించాడు రాజేష్.  

మరోవైపు చెన్నైలో టమోటాలు ప్రస్తుతం కిలో రూ.  100- నుంచి 130 వరకు విక్రయిస్తున్నారు . గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాలలో కిలోకు రూ. 68 కి టమాటాలను విక్రయించాలని నిర్ణయించింది,