న్యూఢిల్లీ, వెలుగు: ఎస్సీ వర్గీకరణకు సహకరించవద్దని కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రాందాస్ అథవాలేను కలిసి ఎస్సీవర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి(ఎస్సీ వీవీపీఎస్) చైర్మన్ చెన్నయ్య కోరారు. ఢిల్లీలో చెన్నయ్య నేతృత్వంలోని ఎస్సీ సంఘాల నేతలు గురువారం కేంద్ర మంత్రిని కలిశారు. ఎస్సీ వర్గీకరణతో తమకు జరిగే అన్యాయాన్ని వారు మంత్రికి వివరించారు. ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 341ను సవరించొద్దని, వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు కట్టబెట్టవద్దని కోరారు. అంతకుముందు బృందంలోని పలువురు మహిళా నేతలు కేంద్ర మంత్రికి రాఖీ కట్టి, శుభాకాంక్షలు తెలిపారు.

