హైదరాబాద్, వెలుగు: అమెజాన్ ఇండియాలో లెగో సెట్ల సెర్చ్‌లు వార్షికంగా 50 శాతం పెరిగాయి. ప్రైమ్ డేకి ముందు అమెజాన్ తన అతిపెద్ద లెగో సమ్మర్ కలెక్షన్‌ను విడుదల చేసింది. స్టార్ వార్స్, మార్వెల్, హ్యారీ పోటర్ వంటి 30 కి పైగా థీమ్‌లలో 100 కి పైగా కొత్త లెగో సెట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
రూ.ఐదు వేల కంటే ఎక్కువ ధర ఉన్న ప్రీమియం సెట్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని అమెజాన్ తెలిపింది. ప్లాస్టిక్‌తో తయారు చేసిన చిన్న చిన్న ఇటుకలు లేదా ముక్కల (బిల్డింగ్ బ్లాక్స్) సముదాయాన్ని లెగో సెట్అంటారు. వీటిని ఒకదానితో ఒకటి కలపడం ద్వారా ఇళ్లు, కార్లు, విమానాలు, రోబోలు, కోటలు, అంతరిక్ష నౌకల వంటివి నిర్మించవచ్చు.
