సెలవు కావాలంటే అడిషనల్ కలెక్టర్ అనుమతి తప్పనిసరి..

సెలవు కావాలంటే అడిషనల్ కలెక్టర్ అనుమతి తప్పనిసరి..
  • 95% హాజరు దాటేదాకా టీచర్లు, హెచ్ఎంలు, అధికారుల లీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు బ్రేక్ 
  • అన్ని స్కూళ్లలో 95% ఎఫ్ఆర్ఎస్ హాజరు చేరేదాకా సెలవులు నో 
  • హైదరాబాద్ కలెక్టర్ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్ల టీచర్లు, విద్యాశాఖ అధికారులు సెలవు కావాలంటే ఇకపై అడిషనల్ కలెక్టర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందే. జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు, టీచర్ల ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ హాజరు 95 శాతానికి చేరుకునే వరకు సాధారణ సెలవులు తీసుకోవద్దని కలెక్టర్ ప్రియాంక అల ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధనలు టీచర్లు, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంలు, డిప్యూటీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (డిప్యూటీ ఐఓఎస్), డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లకు (డిప్యూటీ ఈఓ) వర్తిస్తాయని స్పష్టం చేశారు.

ముందస్తు అనుమతి లేకుంటే చర్యలు.. 

తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఏ స్కూల్ టీచర్, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం, పర్యవేక్షణాధికారి సొంతంగా సెలవు పెట్టడానికి వీల్లేదని కలెక్టర్ తేల్చిచెప్పారు. అడిషనల్ కలెక్టర్ అనుమతి లేకుండా సెలవు పెట్టినా, ఆదేశాలు ఉల్లంఘించినా సీసీఏ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 13న ఉదయం 11 గంటలకు సీఎస్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇతర జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విద్యార్థులు, టీచర్ల ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ హాజరు తక్కువగా ఉందని గుర్తించారు. నాణ్యమైన విద్య, మంచి ఫలితాల కోసం హాజరును 95 శాతానికి పెంచాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

సాయంత్రం 5 గంటలకు రిపోర్ట్.. 

ప్రతిరోజూ టీచర్లు, విద్యార్థుల ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ హాజరును నమోదు చేయాలని హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంలకు ఆదేశించారు. ప్రతి స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 95 శాతం హాజరు సాధించేలా చూడాలన్నారు. డిప్యూటీ ఐఓఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మండలాల వారీగా హాజరును పర్యవేక్షించి డీవైఈఓలకు నివేదిక ఇవ్వాలని, డిప్యూటీ ఈఓలు జోన్ల వారీగా పరిశీలించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించారు. రోజూ సాయంత్రం 5 గంటల్లోపు సమగ్ర నివేదికను అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీ)కి అందజేయాలని ఆదేశించారు.

ఉత్తర్వులపై టీచర్ల సంఘాల అభ్యంతరం.. 

టీచర్లు, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంలు, విద్యాధికారులకు అడిషనల్ కలెక్టర్ ద్వారానే సెలవులు మంజూరు చేయాలన్న ఉత్తర్వులను జిల్లా ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. సంఘాలు పోరాడి సాధించుకున్న హక్కులు, సౌలభ్యాలకు వ్యతిరేకంగా వ్యవస్థలను కేంద్రీకరించడం సమంజసం కాదని పేర్కొన్నాయి. హాజరు మెరుగుదలపై ముందుగా సంఘాలతో సమావేశం నిర్వహించి సమస్యలు, పరిష్కారాలపై చర్చించాలని సూచించాయి.

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏపీ, ఒడిశా, బిహార్, కర్నాటకతో పాటు ఇతర జిల్లాల విద్యార్థులు చదువుతున్నారని సంఘాలు తెలిపాయి. పండుగలు, చావులు, ఎన్నికలు, ఇతర కార్యక్రమాల కోసం సొంత ఊళ్లకు వెళ్లినప్పుడు కొందరు విద్యార్థులు రోజుల తరబడి బడికి రాలేని పరిస్థితి ఉంటుందని వివరించాయి. టీచర్లు కూడా అనారోగ్యం, కుటుంబంలో శుభ, అశుభ కార్యక్రమాల కారణంగా అనివార్యంగా సెలవులు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నాయి.