- మొదటి విడతగా రూ.50 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
పద్మారావునగర్, వెలుగు: లంచం తీసుకుంటూ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఎస్సై వి.నర్సింహులు ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ కేసులో స్టేషన్ బెయిల్ మంజూరు చేయడానికి, భవిష్యత్తులో ఎలాంటి వేధింపులకు గురిచేయకుండా ఉండేందుకు ఓ వ్యక్తిని రూ.లక్ష డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.
ఎస్సై మంగళవారం సాయంత్రం మొదటి విడత రూ.50 వేలను తీసుకుంటుండగా హైదరాబాద్ సిటీ రేంజ్-–1 ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఆయనను అరెస్ట్ చేశామని, జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని, భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు పేర్కొన్నారు.
