న్యూఢిల్లీ: ఏఐ సేవల విభాగంలో 2030 నాటికి అందుబాటులోకి రానున్న దాదాపు 400 బిలియన్ డాలర్లు (రూ.37.89 లక్షల కోట్లు) విలువైన అవకాశాలను చేజిక్కించుకోవడానికి ఇన్ఫోసిస్ సిద్ధమవుతోంది.
కంపెనీ 45 వ ఏజీఎంలో ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని మాట్లాడుతూ ఏఐ రాక వల్ల టెక్ సేవల కంపెనీల ఉనికి దెబ్బతినదని, మరింత బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. జెనరేటివ్ ఏఐ ప్రారంభమై మూడేళ్లు దాటినప్పటికీ, ఇన్ఫోసిస్ మార్కెట్లో మరింత కీలక పాత్ర పోషిస్తోందని ఆయన వివరించారు.
