హార్ట్ బ్రేకింగ్ ...ప్రపంచ కప్ ఫైనల్లో ప్రజ్ఞానంద ఓటమి

హార్ట్ బ్రేకింగ్ ...ప్రపంచ కప్ ఫైనల్లో ప్రజ్ఞానంద ఓటమి

హోరా హోరీగా సాగిన ఫిడే చెస్ వరల్డ్ కప్ ఫైనల్లో మాగ్నస్ కార్ల్ సన్ విశ్వవిజేతగా నిలిచాడు. తొలి రెండు మ్యాచ్ ల్లో గట్టి పోటీనిచ్చిన ప్రజ్ఞానంద.. టై బ్రేక్ లో మాత్రం తడబడ్డాడు. 

టై బ్రేక్ తొలి రౌండ్ ప్రారంభంలో దూకుడు ప్రదర్శించిన ప్రజ్ఞానంద చివరి వరకు దాన్ని కొనసాగించలేకపోయాడు. ప్రపంచ నెంబర్ వన్ చెస్ క్రీడాకారుడైన కార్ల సన్ తన అనుభవాన్ని ఉపయోగించి ప్రజ్ఞానందను ఒత్తిడిలోకి నెట్టాడు. దీంతో టై బ్రేక్ తొలి రౌండ్ కార్ల్ సన్ వశం అయ్యింది.

అనంతరం రెండో రౌండ్ లో డ్రా వైపే మొగ్గుచూపిన కార్ల్ సన్ ఎలాంటి పొరపాటు చేయకుండా సమయస్పూర్తి ప్రదర్శించాడు. దీంతో రెండో రౌండ్ డ్రాగా ముగిసింది. టై బ్రేక్ తొలి రౌండ్ లో ముందంజలో ఉన్న కార్ల్ సన్ విజేతగా నిలిచాడు.

కాగా, ప్రపంచ కప్ ఫైనల్లో తొలి రెండు మ్యాచులను ప్రజ్ఞానంద డ్రాగా ముగించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల అతను.. తన ముందు కూర్చుంది నెంబర్ వన్ ప్లేయరైన ఏమాత్రం తడబడకుండా అతన్ని టై బ్రేక్ వరకు తీసుకెళ్లాడు. దీంతో అతని పోరాటంపై ప్రశంసలు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.