విధులు నిర్వహించేటప్పుడు లక్షణ రేఖను గుర్తుంచుకోవాలి

విధులు నిర్వహించేటప్పుడు లక్షణ రేఖను గుర్తుంచుకోవాలి

దేశంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు అవసరన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ. ఢిల్లీలో సుప్రీం న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో  ఆయన మాట్లాడారు. న్యాయవ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ రెండు పరస్పర సహకారంతో ముందుకు వెళ్ళాలన్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నికైన వారిని అందరూ గౌరవించాల్సిందేనన్నారు. వార్డ్ మెంబర్ నుంచి లోక్ సభ సభ్యుడి వరకు అందరిని గౌరవించాలన్నారు. అందరి విషయంలో చట్టం సమనంగా ఉంటుందన్నారు.

క్షేత్ర స్థాయిలో అధికారవర్గం తన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే కోర్టుల్లో కేసులు తగ్గుతాయన్నారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలను కొందరు దుర్వినియోగ పరుస్తున్నారన్నారు. తమ విధిని నిర్వర్తించే సమయంలో అందరూ 'లక్ష్మణ రేఖ'ను గుర్తుంచుకోవాలన్నారు.త్వరితగతిన కేసుల పరిష్కారానికి మరింత సిబ్బంది అవసరమన్నారు. కోర్టుల్లో మానవ వనరుల కొరత తీరితే కేసుల భారం తగ్గుతుందన్నారు. కోర్టుల ఆదేశాలను కొన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసులు పెరుగుతున్నాయన్నారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (పిఐఎల్) అంటే.. పర్సనల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గా మారాయన్నారు.