4వేల 500 అడుగుల ఎత్తులో పోలింగ్ స్టేషన్..కేవలం 164ఓటర్ల కోసమట ..ఎక్కడంటే..

4వేల 500 అడుగుల ఎత్తులో పోలింగ్ స్టేషన్..కేవలం 164ఓటర్ల కోసమట ..ఎక్కడంటే..

అత్యంత ఎత్తయిన పోలింగ్ స్టేషన్.. దాదాపు 4వేల 500 అడుగుల ఎత్తు..ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు(EVM) , కంట్రోల్ యూనిట్లు, ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(VVPAT) పరికరాలతో అధికారులు కోటకు ట్రెక్కింగ్ చేశారు. ఎక్కడానికి, దిగడానికి కేవలం ఇరుకైన ఇనుప నిచ్చెన మాత్రమే.. వీపున పోల్ మెటీరియ్ మోస్తూ నిటారుగా ఇనుప నిచ్చెన దిగడం ఏమాత్రం అటు ఇటు అయినా గల్లంతే.. మంగళవారం జరిగిన లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ సందర్భంగా ఎన్నికల సంఘం బృందం 4,491 అడుగుల అస్థిరమైన ఎత్తులో ఉన్న పోలింగ్ స్టేషన్‌కు చేరుకోవడానికి పోలింగ్ పార్టీ రాయేశ్వర్ కోట దిగువకు వెళ్లింది.ఈ పోలింగ్ స్టేషన్ కు అధికారులు సామాగ్రితో చేరుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

30 కిలోమీటర్లు ప్రయాణించిన పోలింగ్ బృందం గంటపాటు పాదయాత్ర చేసి పోలింగ్ కేంద్రానికి చేరుకునేందుకు ఏడుగురికి పైగా పోలింగ్ అధికారుల బృందం తమ వీపుపై పోల్ మెటీరియల్‌ని మోస్తూ నిటారుగా ఉన్న ఇనుప నిచ్చెనపైకి దిగడం ఈ వీడియోలో చూడవచ్చు. 

ఇంతకీ ఈ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో చెప్పలేదు కదా.. మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గంలో ఉంది. ఇక్కడ ఓటర్ల సంఖ్య కేవలం 164 మాత్రమే.. వీరికోసం అంత ఎత్తునుంచి ఓ సాహస యాత్రికుల్లా అధికారులు రాయేశ్వరం కోటం నుంచి ఇనప నిచ్చెన ద్వారా ఓటర్లున్న ప్రాంతానికి అంటే  రాయేశ్వరం పోలింగ్ స్టేషన్ కు చేరుకున్నారు. విజయవంతంగా పోలింగ్ స్టేషన్‌కు అవసరమైన అన్ని సామగ్రిని రవాణా చేశారు.

రాయేశ్వరం పోలింగ్ బూత్ బారామతి నియోజకవర్గంలో ఉంది. ఆరు అసెంబ్లీ స్థానాలను కలిగి ఉంది. ఇందాపూర్, బారామతి, పురందర్, భోర్, ఖడక్వాస్తా, దౌండ్ అసెంబ్లీ స్థానాలున్నాయి. మంగళవారం మూడో విడత లోక్ సభ ఎన్నికల్లో 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిగిన పోలింగ్ లో భాగంగా రాయేశ్వరం పోలింగ్ బూత్ లోనూ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

మూడో దశ లోక్ సభ ఎన్నికల్లో 64 శాతం పైగా ఓటింగ్ నమోదైంది. అసోంలో అత్యధికంగా 75 శాతం, అత్యల్పంగా మహారాష్ట్రలో 53.95 శాతం పోలింగ్ నమోదు అయింది. దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.