గుజరాత్ లో భూకంపం.. ప్రస్తుతానికి అంతా కూల్

గుజరాత్ లో భూకంపం.. ప్రస్తుతానికి అంతా కూల్

గుజరాత్ లో వెనువెంటనే రెండుసార్లు భూకంపం సంభవించింది. గిర్ సోమనాథ్ జిల్లాలోని తలాలా అనే పట్టణంలో మే 08వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3:15 నిమిషాలకు భూమి స్వల్పంగా కంపించింది. ఆ తరువాత కేవలం నాలుగు నిమిషాలకే అంటే మధ్యాహ్నం 3.19 నిమిషాలకు 3.6 తీవ్రతతో రెండవ ప్రకంపనలు సంభవించాయి.  

మొదటిసారి భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 3.7గా నమోదు కాగా, రెండోసారి 3.7 గా నమోదైనట్లుగా  గుజరాత్‌ స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ తెలిపింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రాణనష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు. కాగా 2001జనవరి 26 న గుజరాత్‌లో కచ్‌లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.  సుమారు 13 వేల 800 మంది మరణించగా, 1.67 లక్షల మంది నిరాశ్రయిలయ్యారు.